02-01-2026 08:24:54 PM
ముకరంపుర,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టి 20 క్రికెట్ లీగ్ పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మొదటి మ్యాచ్లో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల జట్లు తలపడగా, ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లో కరీంనగర్, హైదరాబాద్ జట్లు తలపడగా, కరీంనగర్ జట్టు విజయం సాధించింది. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశారు.