calender_icon.png 2 January, 2026 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకులు, ఏటీఎంల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి

02-01-2026 09:32:59 PM

సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): బ్యాంకులు, ఏటీఎంల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉండే విధంగా అధికారులు చూసుకోవాలని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై  చంద్రకుమార్ లు సూచించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకులు, ఏటీఎంలను వారు సందర్శించి, బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సిఐ,ఎస్ఐ లు మాట్లాడుతూ బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అలారం పనిచేసేలా చూసుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద లైటింగ్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని మేనేజర్లకు సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినచో పోలీసులకు వెంటనే  సమాచారం అందించాలని వారు కోరారు.