calender_icon.png 14 June, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 నెలలు నిండిన పిల్లలందరిని అంగన్వాడీ కేంద్రానికి పంపండి

13-06-2025 08:02:26 PM

చండూరు,(విజయక్రాంతి): 30 నెలలునిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని నల్గొండజిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు.శుక్రవారం గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో 1.2 అంగన్వాడి కేంద్రాలలో అమ్మ మాట-అంగన్వాడి బాటలో భాగంగా పోషణ వాటిక కార్యక్రమంలో కిచెన్ గార్డెన్ నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ... ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో బాలింతలకు గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా  ఉండాలని సూచించారు.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యానందిస్తారని అలాగే పౌష్టికాహారం కూడా అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ లావణ్య కుమారి, ఏసి డిపిఓ వెంకటమ్మ.సూపర్వైజర్ శివేష. జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సుభాష్. మహేష్ . వివో ఏ స్వరాజ్యం. రిజ్వాన . అధ్యక్షురాలు మీరాభి. అంగన్వాడీ టీచర్స్ వనజ సంతోష. యూత్ సభ్యులు రావుల ఎల్లప్ప .మహేష్ చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు,