శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా చిలుక రవి ఏకగ్రీవం
బోధన్, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా చిలుక రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం దేవాదాయ దర్మాదాయశాఖ అధికారులు ఆలయ పాలక మండలిని నియమించగా పాలక మండలి సభ్యులు జానకంపేట్ గ్రామానికి చెందిన చిలుక రవి కుమార్ ను ఆలయ కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం దేవాదాయ శాఖ అధికారులు చైర్మన్ గా ఎన్నికైన చిలుక రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి, పదవి ప్రమాణం చేయించారు. చైర్మన్ గా చిలుక రవితో పాటు కమిటీ సభ్యులుగా జాన్కంపేట్ కు చెందిన సంజీవ్ సాక్షి, ఉడుత గంగాధర్, జింక లక్ష్మి , రాణాకలాన్ కు చెందిన మెట్టు రాజు, బల్లపాసుల నర్సారెడ్డి, నిజామాబాద్ కు చెందిన గైక్వాడ్ మోహన్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయ పాలక మండలి సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బిల్లా రాంమోహన్, ఎస్ సి సెల్ జిల్లా అద్యక్షులు ఈరంటి లింగం, ఆత్మ కమిటీ చైర్మన్ క్రిష్ణారావు, ఆలయ ఈవో వేణు తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిలుక రవికుమార్ మాట్లాడుతూ, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృసి చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్తానిక ఎంఎల్డీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా చిలుక రవి పాలక మండలి ప్రమాణ స్వీకారం. హాజరైన అధికార పార్టీ నాయకులు, గ్రామపెద్దలు ఈ కార్యక్రమంలోమాజీ సింగిల్ చైర్మన్ లు చిక్కెల లక్ష్మణ్, విజయ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపిటిసి బాలింగం, ఎడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు గ్రామ పెద్దలు మిద్దె చిన్నయ్య, చిలుక నారాయణ, సత్యనారాయణ, రాజాగౌడ్, రాజ లింగం, తదితరులు పాల్గొన్నారు.






