బాన్సువాడలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
భారీగా తరలివచ్చిన విద్యార్థులు బీజేపీ నాయకులు ప్రజలు
బాన్సువాడ, ఆగస్టు 14 (విజయ క్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ నిర్వహించగా,బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు.
‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు . మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఇరువురు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ఐక్యత, సమగ్రతను చాటాలని. నా దేశం నా జెండా నా గౌరవం అనే నినాదం ప్రతి ఒక్క దేశ ప్రజల్లో నిండి ఉండాలని. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదురు సాయిలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి బిజెపి కౌన్సిలర్ గజ్జల మహేష్ జిల్లా కో ఆప్షన్ నెంబర్ ప్రసాద్ కిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు శ్రీనివాస్ నసుల్రాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు.
ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ పంతులు బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ చీకట్ల రాజు శ్యామల శ్రీకాంత్ పాశం భాస్కర్ రెడ్డి శివ శంకర్ కొండని గంగారం సాయిబాబా యోగి పురుషోత్తం సచిన్ ప్రదీప్ మహేందర్, పద్మ నరేష్ సాయి రెడ్డి భూమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






