13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మేడ్చల్‌లో అభివృద్ధి పనులు కనిపించడం లేదా?

14-01-2026 02:12 AM

మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు:వేముల శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ జనవరి 13 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించడం లేదానని మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డిని మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో నీటి సమస్య ఉందని మీకు తెలియదా ఇన్ని రోజులు మాయమై మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే పండుగలకు వచ్చే తుపాకీ రాజాలాగా నీటి సమస్య కోసం నువ్వు మాట్లాడుతున్నావన్నారు.

మేడ్చల్‌లో అస్సలు నీటి సమస్య ఎందుకు వచ్చిందో గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలో తెలియదా మీకు తెలిసింది ఒకటే ఓట్ల రాజకీయం తప్ప వేరొకటి తెలియదని శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేడ్చల్ పట్టణ ప్రజలకు శాశ్వత నీటి పరిష్కారం కోసం మేడ్చల్ మున్సిపల్‌లో డ్రైనేజీ నీరు చెరువులో కలవకుండా 3.25 కోట్ల నిధులతో చేస్తున్న పనులు మీ కంటికి కనిపించడం లేదానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.  మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు. మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్ ఏ బ్లాక్ ఎస్సి సెల్ అధ్యక్షులు మహేష్ కుమార్, మాజీ కౌన్సిలర్‌లు కౌడే మహేష్, నడికొప్పు నాగరాజు, జాకట దేవాలతో పాటు నాయకులు పాలకుర్తి రాఘవేంద్ర గౌడ్, రవీందర్ రెడ్డి, దాత్రిక లింగం, తొంట సుధాకర్, వేముల రంజిత్ రెడ్డి, పత్తి ఆంజనేయులు పాల్గొన్నారు.