13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యమ పాశంలా చైనా మాంజా

14-01-2026 02:19 AM

ఉప్పల్‌లో ఏఎస్‌ఐకి తీవ్ర గాయాలు

ఉప్పల్, జనవరి 13 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగ సమీపిస్తుండటం తో గాలిపటాల సందడి పెరుగుతోంది. కానీ ఈ సంబ రాల మధ్య చైనా మాంజాలు అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లకుంట పిఎస్ లో విధిలు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బైక్ పై బయలుదేరి సమయంలో ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ వద్ద చైనా మాంజా తన మెడకుతగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదంలో బైక్ అదుపు తప్పడంతో మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యి. చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. ఇదే తరహాలో ఉప్పల్ పరిధి వెంకట నగర్ డివిజన్లోని వాసవి నగర్ చెందిన వీరేశ్ కూడా ఇటీవల కాలంలో చైనా మాంజ కారణంగా తీవ్ర గాయాల పాలయ్యాడు వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ మాంజా అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పడటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చైనా మాంజ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.