జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులు
03-06-2026 05:48 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ జె యు) నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక నకిరేకల్ నియోజక వర్గ కేంద్రం లో బుధవారం జరిగింది. ఈ కార్యవర్గంలోకి చిట్యాలకు చెందిన ఇరువురు సీనియర్ జర్నలిస్టులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణలు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షుడి గా చిట్యాల కు చెందిన ఏళ్ల బయన్న, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో వీరు జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికైన వీరికి పలువురు అభినందనలు తెలియజేశారు.






