18 July, 2026 | 3:35 AM

ఓయోలో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అరెస్ట్

02-12-2024 10:20 AM

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పార్టీపై మాదాపూర్ పోలీసులు చేసిన దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి చిక్కారు. కన్హా మహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి పాటు పాటు పట్టుపడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో  కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది. కన్హా మమంతి ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మహంతి ఢీ షోలో చాలాకాలంగా పనిచేశాడు. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.