నా మనసంతా సొంతింట్లోనే
అందాల తార మానస వారణాసి కథానాయికగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా సరసన కథానాయకుడిగా నటించిన మానస.. సత్యభామ పాత్రలో మెప్పించింది. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ప్రముఖ సినీతారలు, మోడల్స్ ర్యాంప్ వాక్‌తో అలరించారు. హీరోయిన్లు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహాశెట్టి షో టాపర్స్‌గా నిలిచారు.
ఈ సందర్భంగా తనను పలుకరించిన ఓ మీడియా సంస్థతో మానస వారణాసి మాట్లాడింది. పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. “2020లో మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఇటీవల చాలా గ్యాప్ తీసుకున్నానని చాలా మంది అంటున్నారు. అయితే, అది గ్యాప్ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ సొంత ఇల్లు.. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది.
ముంబయి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఫ్యాషన్ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలైంది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి” అని చెప్పింది మానస.






