30 August, 2026 | 10:54 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

అలా చేస్తేనే చాన్స్ ఇస్తామని చెప్పారు!

04-06-2025 01:29 AM

‘దేవుళ్ళు’ సినిమాతో బాలనటిగా బాగా నేమ్ ఫేమ్ సొంతం చేసుకుంది నిత్యాశెట్టి. ఆ ఒక్క చిత్రమే కాదు.. ‘అంజి’, ‘చిన్ని చిన్ని ఆశ’, ‘లిటిల్ హార్ట్స్’, ‘మాయ’ లాంటి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. అంతేకాదు బాలనటిగా ఉన్నప్పుడే నంది అవార్డునూ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. కాలం గిర్రున తిరిగి.. నిత్యాశెట్టి హీరోయిన్‌గా మారి, కీలక పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి సుపరిచితు రాలినే కదా..  హీరోయిన్‌గా పిలిచి ఛాన్సులు ఇచ్చేస్తారులే అనుకున్నా. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆడిషన్స్ ఇచ్చా. ఓ ఆడిషన్‌లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారు.. సర్జరీ చేసుకొని వస్తే ఛాన్స్ ఇస్తామన్నారు. ఇంకోసారి ‘దేవుళ్ళు’ పాప కదా.. హీరోయిన్‌గా సెట్ అవ్వదు అన్నారట. ఇంకోసారి నేను కొంచెం నల్లగా ఉన్నానని..

ఫెయిర్‌గా లేనని కామెంట్ చేశారు. ‘ఓ పిట్టకథ’ సినిమా అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. డైరెక్టర్ నన్ను ఓకే చేసినా నిర్మాతలు లావుగా ఉన్నానని పెదవి విరిచారు. ఓకే చేసేశారు కదా అని షూటింగ్‌కి వెళ్లే గ్యాప్‌లో ఛాలెంజ్‌గా తీసుకొని 20 రోజుల్లో ఆరు కిలోలు తగ్గి చూపించా. హీరోయిన్‌గా నాకు గుర్తింపు తెచ్చిన సినిమా అదే” అని తెలిపింది నిత్యాశెట్టి.