25-12-2025 04:05:06 PM
భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలు సమానం.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
బాన్సువాడ,(విజయక్రాంతి): ఏసుప్రభు జీవితం ప్రపంచంలోనే అందరికీ ఆదర్శప్రాయమని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలకు సమానంగా చూడడం జరుగుతుందనీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ తో పాటు కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాసుల బాలరాజులకు ప్రజాప్రతినిధులకు ఆశీర్వాదం అందజేశారు.
చర్చిలో కమిటీ సభ్యులతో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజులు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజులు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు వంటి ఎలాంటి మత విద్వాషాలు లేవని అన్ని మతాలు సమానమని భారతదేశం అందుకు ఆదర్శమని వారు పేర్కొన్నారు. ఏసుప్రభు ప్రపంచ దేశాలకే ఆయన జీవితం ఆదర్శమనారు. మానవాళిలో ఆనందం నింపిన ఏసుప్రభు పండగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఏసుప్రభు ఆశీర్వాదం అందరిపై ఉండాలని వారు అన్నారు. చర్చి ఫాదర్ చర్చిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని కోరడంతో వెంటనే స్పందించిన పోచారం చర్చి ఫాదర్ ఉండేది కోసం రూపాయలు 10 లక్షలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చర్చి కమిటీ సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు జేమ్స్ ప్రశాంత్ శాంతి కుమార్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.