calender_icon.png 25 December, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు తారిఖ్ రహమాన్

25-12-2025 03:48:39 PM

ఢాకా:  బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహమాన్(BNP leader Tarique Rahman) లండన్‌లో 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత తన భార్య, కుమార్తెతో కలిసి గురువారం ఢాకాలో అడుగుపెట్టారు. విమానాశ్రయం నుండి, రెహమాన్ పూర్బాచల్‌లోని 300 ఫీట్ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడ ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గత వారం యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తరువాత ఈ దక్షిణాసియా దేశం హింసతో అట్టుడుకుతున్న కీలక తరుణంలో రెహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రెహమాన్, 2026 ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికలలో ప్రధానమంత్రి పదవికి బలమైన పోటీదారులలో ఒకరు. తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పై గతంలోనే నిషేధం విధించారు. నిషేధంతో అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీకి అవకాశం కోల్పోయింది.