calender_icon.png 25 December, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్మస్ పండగ ప్రేమ శాంతి సౌబ్రాతృత్వాన్నికి ప్రతిక..

25-12-2025 04:48:23 PM

ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవ ఆలయాలు మారుమోగాయి

గోపాల్పేట్ గ్రామ క్రిస్మస్ వేడుకల్లో ఆర్డిఓ పార్థసింహారెడ్డి పాల్గొన్నారు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలో క్రిస్మస్ సెలబ్రేషన్ పర్వదినాన పండగ వేడుకలు అంబరాన్ని అంటాయి.ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు అట్టాసంగా జరిగాయి.క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.వెలుగులు విరజిమ్మి కొవ్వొత్తుల కాంతులు,క్రిస్మస్ చెట్లు,బాల యేసు జన్మనృత్యాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు.సర్వంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు క్రైస్తవ సోదర సోదరులతో కిటకిటలాడాయి.ఏసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని గ్రామాలలో క్రైస్తవ సోదర,సోదరీమణులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవ దేవాలయాలు మారుమోగాయి.గోపాల్పేట్ గ్రామంలో క్రిస్మస్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.మండలంలోని ఆయా గ్రామాల్లో గల చర్చిల్లో పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు.యేసుప్రభు జనన రహస్యాన్ని అందరూ ప్రేమ పూర్వంగా ఒకరినొకరు సోదర భావంతో మెలగాలని పిలుపునిచ్చారు.ఏసుప్రభు దీవెనలు అందరికీ ఉండాలని తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్డీవో గోపాల్పేట్ గ్రామంలో చర్చి వేడుకల్లో పార్థసింహారెడ్డి మాట్లాడుతూ... క్రిస్మస్ పండగ ప్రేమ,శాంతి సౌబ్రాతృత్వాన్నికి ప్రతిక అని పేర్కొన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.గోపాల్పేట గ్రామంలో గల క్రిస్మస్ వేడుకల్లో గ్రామ నూతన సర్పంచి వంశీకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.