24 June, 2026 | 2:32 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

యువత చెడుకు దూరంగా ఉండాలి

03-05-2026 01:15 PM

పట్టణ సిఐ కె.శివశంకర్

కోదాడ: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి అలవాటులను అలవర్చుకోవాలని పట్టణ సీఐ కె శివశంకర్ అన్నారు. కోదాడ పట్టణ బాలల ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత వాలిబాల్ శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించి యువకులతో క్రీడాకారులతో మాట్లాడారు. గ్రౌండ్ ని నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరని మంచి అలవాటుకు దగ్గరగా ఉంటారని మీరందరూ ప్రతిరోజు క్రీడ కోసం సాధన చేయటం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు క్రీడాకారులకుపౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ సిపిఐ నాయకులు భద్రం భద్రారెడ్డి ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచులు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు వాకర్ సభ్యులు పాల్గొన్నారు