12-07-2025 12:02:55 AM
జయశంకర్ భూపాలపల్లి(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామ శివారులో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా ఎస్సై రేఖ అశోక్ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి కిలో ఎండు గంజాయి పట్టుకున్నామని సీఐ మల్లేష్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం గణపురం మండల పరిధిలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన బెడ్డల శ్రీనివాస్ హైదరాబాదులో ఓ పబ్ లో పని చేస్తున్న సందర్భంగా మహారాష్ట్ర లోని పల్లార్చకు చెందిన సల్మాన్ మాస్జిద్ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, దీంతో అక్కడ తక్కువ ధరకు గంజాయి తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్పడంతో ఆశతో జనగామ కు చెందిన ప్రేమ్ తేజ్ వ్యక్తితో కలిసి గంజాయి వ్యాపారం మొదలుపెట్టారని, గణపురం, భూపాలపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని సీఐ తెలిపారు.