calender_icon.png 13 July, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండ మాట తీరే వేరు

12-07-2025 12:02:10 AM

  1. తరచూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేస్తున్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి

దేశభక్తి చాటేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్దళ్ వంటి వేదికలు చూసుకోవాలని అనడంతో విస్మయం చెందుతున్న నాయకులు కార్యకర్తలు 

తనకు కార్యకర్తలతో పనిలేదని నేరుగా చెబుతున్న ఎంపీ 

అయోమయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు 

వికారాబాద్, జూలై 11 (విజయ క్రాంతి )చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రె డ్డి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు బిజెపి నాయకులను, కార్యకర్తలను గందరగోళానికి గురిచే స్తున్నాయి. సీనియర్ నాయకులను, కార్యకర్తలను లెక్కచేయకుండా మాట్లాడడం వారి ని ఒకింత అసహనానికి గురిచేస్తుంది.  బిజె పి పార్టీ మనుగడ సాధించాలంటే కార్యకర్త లు సిద్ధాంతాలను పక్కనపెట్టి మాంసం తి నే వాళ్లను టోపీ ధరించే వాళ్లను సంప్రదించాలని అనడం బిజెపి పార్టీ నాయకుల ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఒక పార్టీ సి ద్ధాం తం పై గెలిచిన ఎంపీ ఇలా మాట్లాడడం ఏమిటని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.ఈ మాటలను మర్చిపోకముందే ఎంపీ పార్టీ కార్యకర్తలతో సహ నం కోల్పోయి మాట్లాడారు. నాలుగు రోజు ల క్రితం వికారాబాద్ కు ఎంపీ వస్తున్నారనే విషయం తెలుసుకున్న సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ వాహనాన్ని ఆపి స మస్యలు చెప్పుకునే క్రమంలో కార్యకర్తలపై కోపంతో ఊగిపోయారు.

ఎంపీ కోపాన్ని చూసిన ఓ కార్యకర్త మిమ్మల్ని గెలిపించిన కా ర్యకర్తలు మీకు అవసరం లేదా సార్ అనీ ప్రశ్నిస్తే, అవసరం లేదంటూ ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని చూసిన నాయకులు, కార్యకర్తలు గమ్మున ఉండిపోయారు.

దశాబ్దాలుగా ఇక్కడ బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే ల ప్రాతినిధ్యం లేకపోయినా పార్టీని నమ్ముకుని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంపీ తీరుపై లోలోన మదన పడుతున్నారు. దశాబ్దాలు గా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచే స్తున్న నాయకులను ఎంపీ లెక్కచేయకుం డా మాట్లాడడం బిజెపి కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. 

 ఎంపీ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

ఇటీవల వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీలో పని చేయాలనుకునేవారు మాంసం తినే వాళ్లను, టోపీ ధరించే వాళ్లను కలుపుకొని పోవాలని సూచించారు. బిజెపి ఒక రా జకీయ పార్టీ అని, పార్టీ మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల వారిని కలుపుకొని పో వాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

మాంసం తినే వాళ్లను, టోపీ ధరించే వాళ్లను పలకరించమనే వాళ్లు మరో దారి చూసుకోవాలన్నారు. పార్టీ అధ్యక్ష పదవుల కోసం నా మినేటెడ్ పదవుల కోసం పాకులాడే వాళ్ళు పార్టీని వీడొచ్చని పరోక్షంగా అన్నారు. ఎంపీ వ్యాఖ్యాలతో అక్కడున్న నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులు పార్టీ పదవుల కోసం నామినేటెడ్ పదవులు కోసం కాకుం డా ఎందుకోసం పనిచేస్తున్నారో ఎంపీ చెప్పాల్సిన అవసరం ఉందని బిజెపి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండ విజ యం కోసం ఎంతో కష్టపడి పని చేసిన...... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని బిజెపి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుని ఎన్నిక విష యంలో కూడా ఎంపీ ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుని ఎన్నిక తర్వాత పార్టీ లో గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరాయనే ప్రచారం జరుగుతుంది.

 ఎంపీ తీరు మారలేదంటున్న నాయకులు

2014లో బీఆర్‌ఎస్ తరపున విజయం సాధించిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి నాయకులకు సాధారణ కార్యకర్తలకు పెద్దగా ఉపయోగపడలేదనే ఆరోపణ ఉంది. సాధారణ కార్యకర్త లు, ప్రజలు ఎవరైనా సహాయం కోసం పోతే నేను ఎందుకు చేయాలి....? మీరే స్వతగా చే సుకోవాలి అని తిప్పి పంపిన సందర్భాలు చాలా ఉన్నాయనే ప్రచారం ఉంది. 2019 లో రెండోసారి ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేసిన....

ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం అనే ప్రచారం ఉంది. 2024లో బీజేపీ నుండి పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి ని బిజెపి పార్టీ గుర్తు, ఆ పార్టీ సిద్ధాంతమే గెలిపించిందనే విషయం సుస్పష్టం. అయితే ఇప్పుడు ఎంపీ ఆ పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ కార్యకర్తలను లెక్కచేయకపోవడం వంటి పరిణామాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను గందర గోళానికిగురిచేస్తుంది.