12-07-2025 12:04:00 AM
వృద్ధురాలిని అప్పగించిన పోలీసులు
మహబూబాబాద్, జూలై 11 (విజయక్రాంతి): మహబుబాబా ద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేది క వద్ద వదిలేసిన విషయంపై గూ డూరు ఎస్సై గిరిధర్‌రెడ్డి స్పందించారు. భద్ర మ్మ కొడుకులను పోలీసులు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
దీంతో కన్నతల్లిని తీసుకెళ్ల డానికి కొడుకులు ఒప్పుకున్నారు. తల్లికి ఎ లాంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా చూ సుకోవాలని సూచించారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారిని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు భద్రమ్మ కొడుకుల చెంతకు చేరింది.