calender_icon.png 22 July, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎంని కోరతాం

22-07-2025 03:03:40 PM

హైదరాబాద్: తెలంగాణ మైనింగ్, కార్మికశాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి మంగళవారం సిద్ధిపేటలో పర్యటించారు. సిద్ధిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గడ్డం వివేక్ కు ముందుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, ఇళ్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని తెలిపారు. దాదాపు 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.  మంత్రి వివేక్ సిద్ధిపేట పర్యటనలో బీఆర్ఎస్ నేతలు రచ్చ రచ్చ చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతల ఆందోళన చేశారు.