22-07-2025 02:37:42 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): సీపీఎం పార్టీ జాతీయ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(Former Kerala Chief Minister VS Achuthanandan) గుండె పోటుతో మృతి చెందగా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్(Aleti Kiran Kumar) అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ చిన్న వయస్సులో కమ్యూనిస్టు పార్టీలో చేరి పార్టీ అత్యున్నత స్థాయి పొలిట్ బ్యూరో నేతగా, కేరళ ప్రభుత్వంలో ఏడు సార్లు ఎంఎల్ఏగా మూడు సార్లు విపక్ష నేతగా వ్యవహరించారన్నారు.
ప్రజా సంక్షేమ పథకాల అమలుకు గళమెత్తారని సిపిఎం ప్రభుత్వంలో 2006 నుండి 2011వరకు కేరళ ముఖ్యమంత్రిగా ప్రజాపాలన నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి పథకాలు అమలు చేశారన్నారు. ఎనిమిదిన్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా ప్రజాసేవ చేశారని మొదట ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పనిచేసి ఆస్వీయాల్ కంపెనీలో సిఓఐఎల్ కార్మికులను పోరాటంలో నడిపారని, కేరళలో ప్రతిష్టాత్మక పోరాటం ఉన్నప్ప వాయిలార్ పోరాటంలో రహస్య జీవితం గడటంతోపాటు పోలీసు కస్టోడియల్ హింసకు గురయ్యారన్నారు. సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత గల నేతగా, ఆచరణలో కఠినమైన నిబద్ధత గల నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటి సభ్యులు తాళ్లూరి కృష్ణ, సుల్తాన, ఖాదర్ , మునిగంటి లక్ష్మీ, సర్వన్ కుమార్, కామ నాగరాజు సత్యనారాయణ కోరి రమేష్, లక్ష్మణ్ పాసి, రాము, వెంకటేశ్వర్లు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.