calender_icon.png 22 July, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద.. మరోసారి గేట్లు ఓపెన్

22-07-2025 01:48:36 PM


నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎగువ నుండి వరద తాకిడి వల్ల జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 87,535 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 39,411 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండడంతో 883.90 అడుగుల వద్ద చేరి 209.1579 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. ప్రస్తుతం చేరిన నీటితో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు మరోసారి ఒక క్రస్ట్ గేట్ 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.