22-07-2025 01:44:16 PM
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు(Karimnagar District) చెందిన వ్యక్తికి దుబాయ్ లో కష్టాలు ఎదురయ్యాయి. ఏడు నెలల క్రితం ఉపాధి కోసం దొబ్బల బాలరాజు(50) అనే వ్యక్తి దుబాయ్(Dubai)కి వెళ్లి కష్టాల్లో చిక్కుకున్నాడు. బాలరాజు స్వస్థలం చిగురుమామడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామం. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య బాగాలేక పనిచేయని స్థితికి చేరుకున్నాడు. యాజమాన్యం తన పాస్ పోర్టు(Passport) లాక్కొని వేధిస్తున్నట్లు బాలరాజు వాపోతున్నాడు. దుబాయ్ లో తన కష్టాలు వివరిస్తూ బాలరాజు భార్యకు సెల్ఫీ వీడియో పంపాడు. తన భర్తను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని స్వరూప తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని స్వరూప విజ్ఞప్తి చేస్తోంది. బాధితుడు దొబ్బల బాలరాజుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.