22-07-2025 02:31:23 PM
హైదరాబాద్: ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ఐదు వేల మంది తల్లులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కేసీఆర్ కిట్లను అందించారు. "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్ లో మంగళవారం కేసీఆర్ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్(Revanth Sarkar) కిట్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కిట్(KCR Kit)లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని గుర్తుచేశారు.
కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్, "గిఫ్ట్ ఏ స్మైల్"(Gift A Smile)లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందజేశారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వెల్లడించారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు సూచించారు.
2014కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే(Sarkar Dawakhana) పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు.