calender_icon.png 12 August, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్‌.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

12-08-2025 10:51:01 AM

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) నిధుల గోల్ మాల్ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజును సీఐడీ అధికారులు ఆరో రోజు విచారిస్తున్నారు. హెచ్‌సీఏ నిధుల గోల్ మాల్ పై దేవరాజును సీఐడీ(Criminal Investigation Department) అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ అంశంపై సీఐడీ ఆరా తీసింది. దేవరాజు నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. జగన్మోహన్ రావుతో కలిసి నకిలీ బిల్లులతో నిధులు కాజేసినట్లు గుర్తించారు.