12-08-2025 11:15:52 AM
ఆడిట్ చేస్తామని తెలిపిన అధికారులు?
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని(Chityal Mandal) గుంటూరుపల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ నిధుల అవినీతిపై ఆ గ్రామస్తులు గ్రీవెన్స్ సెల్(Grievance cell)లో ఫిర్యాదు చేశారు.ఉపాధి హామీ పనులలో సుమారు 40 లక్షల రూపాయల అవినీతి జరిగిందని,కూలీలకు తెలియకుండా తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నిధులను మాజీ ప్రజా ప్రతినిధి సొంత అకౌంట్ కు మరలించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆ ప్రజాప్రతినిధి బంధువుల, ఇతర దేశాల్లో ఉంటున్న ఇక్కడి గ్రామస్తుల పేర్ల పైన పని చేయకున్నా నిధులను జమ చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారులు త్వరలోనే తిరిగి ఆడిట్ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో మన్నెం శ్రీనివాస్ రావు, సదా శివరావు,పువ్వాటి హరికృష్ణ,మెట్టు శేషగిరి రావు,శి వ రామకృష్ణ, ముద్దన నాగరాజు, శ్రీనివాస్, శ్రీకాంత్, ధనుష్, పువ్వాటి హరికృష్ణ, సతీష్ తదితరులు ఉన్నారు.