12-08-2025 12:36:13 PM
నంగునూరు: కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు, అంతకుముందు బీమాకు(Rythu Bima scheme) దరఖాస్తు చేసుకొని రైతులు ఈనెల 13 వ తేదీలోగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని నంగునూరు ఏఓ గీత తెలిపారు. 2025 జూన్ 5వ తేదీ నాటికి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు రైతు బీమాకు అర్హులని సంబంధిత పత్రాలు ఆయా గ్రామాల రైతు వేదికల్లో అధికారులకు అందజేయాలని సూచించారు.18 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 59 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రైతులు మాత్రమే అర్హులని, ఇందుకు పుట్టిన తేదీని ఆధార్ ప్రకారం మాత్రమే పరిగణించబడుతుందని ఆమె తెలిపారు.