12-08-2025 12:27:25 PM
జిల్లాలో పూర్తిస్థాయిలో చెరువులు నింపడం లేదు
ఉభయ సముద్రం వద్ద మాజీ మంత్రి నిరసన
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా మంత్రులు దద్దమ్మలని మరో సారి రుజువు అయిందని, ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు అసమర్థులే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) పేర్కొన్నారు.నల్గొండ పట్టణంలో ని, ఉదయ సముద్రం చెరువు వద్ద మంగళవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) తో నిరసన వ్యక్తం చేశారు కృష్ణా బేసిన్ లోకి పుష్కలంగా నీరు వచ్చి, సాగర్ గేట్లు ఎత్తి సముద్రం లోకి నీటిని వదులుతున్నారు కానీ, జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపకుండా, మేజర్ల కింద, డిస్ట్రిబ్యటరీల కింద నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకొండ, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గంలో లాల్లో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు కేవలం కమిషన్ లు, ఆర్భాటాలు తప్పితే ఈ మంత్రుల వల్ల జిల్లా కు ఒరిగింది ఏమీ లేదన్నారు. కనీసం నీళ్లు ఇవ్వాలేని చేతకాని మంత్రులు వీళ్ళు మా హయాంలో ఉదయసముద్రం మత్తడి దుంకెలా అన్ని చెరువులు నింపామని ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నింపడం లేదని ఆయన ప్రశ్నించారు.