12-08-2025 11:36:32 AM
నాగార్జునసాగర్, విజయక్రాంతి: నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో… సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్(Nagarjunasagar)కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు.. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో 12 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా గేట్లను ఎత్తుతున్నారు. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు(Nagarjuna Sagar Project) భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు 5 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు.. ఇన్ ఫ్లో 1,38,093 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,093 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత సామర్థ్యం 310.2522 టీఎంసీలుగా ఉంది.. అయితే, ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. ఇన్‌ఫ్లో పెరుగుతుంది.. దాదాపు 1.73 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మరిన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు..
ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది.. దీంతో, ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారు.. శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) వరద నీరు కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో మూడోవ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు.. జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇక, శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 2,23,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,73,651 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్(Srisailam Dam) పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా ఉందని.. మరోవైపు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. దీంతో, మొత్తం 1,73,651 క్యూసెక్కులు నీరు ఔట్‌ఫ్లో రూపంలో ప్రాజెక్టు నుంచి వెళ్తుంది..