12-08-2025 12:31:05 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 21వ వార్డు బూడిద బస్తీలో(Budidagadda Basti) ఇటీవల నూతనంగా నిర్మించ తలపెట్టిన వినాయక మండపాన్ని మంగళవారం బెల్లంపల్లి తాసిల్దార్ కృష్ణ, బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ ప్రాంతంలో గణేష్, దుర్గామాత నవరాత్రుల కోసమని బస్తీ వాసులు మండపాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో హుటాహుటిన అక్కడి చేరుకొని కూల్చివేసే ప్రయత్నం చేశారు.
కూల్చివేత ప్రయత్నాన్ని బస్తివాసులు అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంతమేర మండపం చుట్టూ ఇటుకలతో నిర్మించిన గోడను కూచివేశారు. బస్తివాసులు అడ్డుకున్నప్పటికీ రెవెన్యూ, పోలీసులు వినకుండా వినాయక మండపం కోసం ఏర్పాటుచేసిన షెడ్డును కొంత భాగం కూల్చివేసి అక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తొలగించడంలో వెనక్కి తగ్గారు. స్థానికులను వినాయక విగ్రహాన్ని తీసివేయాల్సిందిగా పోలీసులు కోరడంతో వారు అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం బూడిద బస్తిలో ప్రతిష్టంబరం నెలకొంది.