12-08-2025 11:12:16 AM
జైపూర్,(విజయక్రాంతి) : బంజారహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడిని(Peddamma thalli temple) అక్రమంగా కూలగొట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హిందూ సంఘాల పిలుపు మేరకు మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లనున్న మండల నాయకులను జైపూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం జైపూర్ మండల అధ్యక్షులు పల్లికొండ వెంకటేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి రాము, ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు అట్ల సుమన్ రెడ్డి తదితరులు ఉన్నారు.