12-08-2025 12:39:08 PM
నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయంలోకి(Srisailam reservoir) వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరదనీరు అధికంగా చేరడంతో ఇప్పటికే పూర్తిగా నిండిన శ్రీశైలం జలాశయం నుంచి మంగళవారం అధికారులు నాలుగు గేట్లను పది ఫీట్ల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇది మూడోసారి గేట్లను ఎత్తి నీరు దిగువకు వదిలారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.