12-11-2025 01:10:01 AM
ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 11: దలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం అని టీపీసీసీ సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం అదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లి పటేల్ గూడ గ్రామానికి చెందిన బోడిగే బుగ్గమ్మ కు రూ.60 వేలు, మంచాల మండలం, దాద్ పల్లి అనుబంధ గ్రామం వెంకటేశ్వర తండా కు చెందిన పలియా కళావతి లకు రూ.60వేల చెక్కులను మర్రి నిరంజన్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి, లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్ కుంట ఉదయపాల్ రెడ్డి, లబ్ధిదారులు బుడిగ జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.