13 July, 2026 | 1:20 AM

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్

13-07-2026 12:30 AM

కరీంనగర్, జూలై 12 (విజయ క్రాంతి): నగరంలోని 1వ డివిజన్ హనుమాన్ నగర్లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద 12.80 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్  కొలగాని శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి డివిజన్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు తదితర అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రజలకు నాణ్యమైన రహదారులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ భారీ అపర్ణ జితేందర్, 26 వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.