నందిని, వాల్మీకి విద్యాలయంలో స్కాలర్‌షిప్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రదానం
13-07-2026 12:31 AM
ముకరంపుర, జూలై 12 (విజయ క్రాంతి): నగరంలోని నందిని కాన్వెంట్, వాల్మీకి విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ స్కాలర్షిప్ టెస్ట్-2026లో విజేతలుగా నిలిచిన 30 మంది విద్యార్థులకు ఆదివారం బహుమతుల ప్రదానం చేశారు.
పాఠశాలల చైర్మన్ యాదగిరి శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఏర్రం రాజారెడ్డి, ఏకలవ్య చైర్మన్ నరసింహ రావు, పచ్చునూరి సురేందర్ లు హాజరై విజేతలను నగదు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






