సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
10-12-2024 12:19 AM
* అభ్యర్థుల జాబితా ప్రకటించిన యూపీఎస్సీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆల్ ఇండియా సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ నిర్వహించారు. జూన్ 16న ప్రిలిమ్స్ నిర్వహించి జులై 1న ఫలితాలు ప్రకటించారు. ఇంటర్వ్యూలో సత్తా చాటిని వారిని సివిల్ సర్వీసెస్ అధికారులుగా ఎంపిక చేస్తారు.






