16 July, 2026 | 9:00 AM

ఒక్కరోజు ఫీజు రూ.17 వేలు

10-12-2024 12:15 AM

* పర్యాటకుల కోసం జపాన్‌లో స్పెషల్ స్కూల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆసియాలో అత్యుత్తమ విద్యనందించే దేశాల్లో జపాన్ ఒకటిగా పేరుపొందింది. అక్కడ చదువుతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు తదితర అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే ఇతర దేశాలకు తమ దేశంలోని పాఠశాలలపై ఉన్న ఆసక్తిని గమనించిన ఓ జపాన్ కంపెనీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. జపాన్‌కు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఉండోకయ అనే సంస్థ సరికొత్త పథకాన్ని రూపొందించింది. తమ దేశానికి వచ్చే విదేశీ పర్యటకులు రూ.17 వేలు చెల్లిస్తే.. వారికి ఒక రోజంతా అక్కడి మాధ్యమిక పాఠశాల విద్యార్థి పొందే అనుభవాలను కల్పిస్తామని వెల్లడించింది.