13-11-2025 01:12:45 AM
2,736 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విదుదల చేసింది. దేశ వ్యాప్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు ప్రకటిం చింది. తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆగస్టు 22 నుంచి 31 వరకు సివి ల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి.
మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి కలిపి వచ్చిన మొత్తం మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల తేదీని త్వరలోనే యూపీఎస్సీ ప్రకటించనుంది.