8 June, 2026 | 9:52 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ విజయవంతం

10-04-2026 12:00 AM

కామారెడ్డి అర్బన్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం జెండర్ అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీ నుంచి ఒక్కో జెండర్ పాయింట్ పర్సన్గా మొత్తం 29 మంది పాల్గొన్నారు. గ్రామాల్లో హింసలేని కుటుంబాల నిర్మాణం, అంటరానితనం నిర్మూలన, జననం-మరణం నమోదు ప్రాధాన్యత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికుల నిర్మూలన, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.

జెండర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగ గౌడ్ సమాన పనికి సమాన వేతనం, కుటుంబాలకు అదనపు ఆదాయం అవసరం వంటి అంశాలను వివరించారు. ఎస్‌ఐ ప్రభాకర్ మానవ అక్రమ రవాణా నిర్మూలనపై మాట్లాడగా, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుప్రియ బాల్య వివాహాల నివారణపై సూచనలు చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపిడీ విజయలక్ష్మి, ఐబీ డీపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎం శ్రీనివాస్ లు, సీసీలు, ఎంఎస్‌ఏ సభ్యులు పాల్గొన్నారు.