calender_icon.png 20 August, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీ

20-08-2025 01:27:35 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19:మండల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో సివిల్ సప్లై, టాస్క్ ఫొర్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టాస్క్ ఫొర్స్ డిఎస్పి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం నిల్వల వివరాలు, సప్ప్లై అయిన స్టాక్ వివరాలు సేకరించి కరెక్ట్ గానే ఉన్నాయని తెలిపారు. వంట గదిలో వంట సామాగ్రి, కూరగాయలను పరిశీలించారు.

ఫుడ్ కు సంబందించిన సామాగ్రిలో పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులతో అక్క డి సమస్యలను ఆరా తీసారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫొర్స్ సీఐ అజయ్ బాబు, ఎస్‌ఐ క్రిష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రా మకృష్ణ, గురుకుల స్కూల్ అండ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.