calender_icon.png 20 August, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపికి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లను తొలగిస్తున్నారు

20-08-2025 01:28:41 AM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

కామారెడ్డి,(విజయక్రాంతి): బిజెపికి అనుకూలంగా లేని రాష్ట్రాలలో ఓట్లను తొలగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరయ్యారు. అనంతరం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరిక అధ్యక్షుడు ఏది చెప్తే అది వినే పరిస్థితిలో లేమని ప్రధాని మోదీ అంటున్నారని తెలిపారు. రష్యా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు   చేసుకొని 25%శాతం పన్ను చెల్లించి 50 శాతం నష్టపోతున్న రన్నారు. విదేశీ వాణిజంపై పార్లమెంటులో ఎందుకు చర్చించడం లేదన్నారు.

బీహార్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని ఆరోపించారు. బిజెపికి అనుకూలంగా లేని రాష్ట్రాలలో ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను సిపిఎం ఖండిస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రం నిర్లక్ష్యం వహి స్తుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం పుంజుకునే సమయంలో యూరియా ఇవ్వడం తగ్గించారన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ను కేంద్రం అడ్డుకుంటుందన్నారు.

రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరగకుండా ఆలస్యం అవుతాయని దీనితో నిధులు రాకుండా తీవ్రంగా రాష్ట్రం నష్టపోతుందని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని అధికారంలో వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.