calender_icon.png 3 October, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్న ఊరు.. కన్నవారిని విడిచి మావోయిస్టులు సాధించేది ఏం లేదు

03-10-2025 02:38:48 PM

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి తల్లికి నిత్యావసరాల సరుకుల పంపిణీలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్

మంథని,(విజయక్రాంతి): మావోయిస్టులు ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను విడిచి ఉద్యమంలో ఉండి సాధించేది ఏమీ లేదని, జనజీవన స్రవంతిలో కలిసి పోయి, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో  జీవించాలని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు. దసరా పండుగ సందర్భంగా గురువారం  మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి  స్వగ్రామమైన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేటలో రాజిరెడ్డి తల్లి వీరమ్మ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... ఉన్న ఊరును కన్నతల్లి తండ్రులను విడిచి అడవిలో ఉండి సాధించేదేమీ లేదన్నారు.  రాజిరెడ్డి ఇప్పటికైనా లొంగిపోయి వృద్ధాప్యంలో ఉన్న తల్లి వీరమ్మ యోగక్షేమాల చూడాలన్నారు. లొంగిపోతే ప్రభుత్వం నుండి వచ్చే రివార్డుతోపాటు ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం వీరమ్మకు దసరా పండుగ సందర్భంగా బట్టలు పండ్లు బియ్యం ఏసీపీ అందించారు. ఆయన వెంట సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేష్ ఉన్నారు.