calender_icon.png 3 October, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి కన్నెర్ర.. కుభీర్ రైతులకు భగ్గుమన్న నష్టం

03-10-2025 02:42:44 PM

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వర్షాలు రైతులకు(farmers) పెద్ద దెబ్బ కొట్టాయి. గత నెలరోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రధాన పంటలు సోయాబీన్, పత్తి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. చేతికొచ్చిన సోయాబీన్ పంట నీట మునిగి గింజలకు మొలకలు వచ్చి రైతులు భాధపడుతున్నారు. మరోవైపు పత్తి చెట్లపై కాయలు పగిలిపడి, వర్షానికి తడిసి నల్లబడి నేలకొరిగిపోతున్నాయి. దీంతో రైతాంగం కన్నీళ్ల మునిగిపోయింది. మండలంలో మొత్తం 50,788 ఎకరాలు సాగులో ఉండగా, అందులో సోయాబీన్ 22,855 ఎకరాలు, పత్తి 24,066 ఎకరాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. మొక్కజొన్నకు పెద్దగా నష్టం లేకపోయినా, ప్రధానంగా సోయా, పత్తి పంటలే రైతుల కష్టార్జితాన్ని దెబ్బతీశాయి.