calender_icon.png 3 October, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన దసరా పండుగ సంబరాలు..

03-10-2025 02:36:18 PM

  1. జమ్మి పంచుతూ, ఆలింగణం చేసుకుంటూ శుభాకాంక్షలు
  2. కన్నుల పండువగా సాగిన అమ్మవారి నిమజ్జన శోభాయాత్రలు 
  3. వెళ్లి.. మళ్లీ రా.. దుర్గమ్మ తల్లి అంటూ వేడుకున్న ప్రజలు 

విజయక్రాంతి,పాపన్నపేట: దసరా సంబరాలు గ్రామ గ్రామాన అంబరాన్నంటాయి. షమీ పూజలు, రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. జమ్మి పంచుతూ, ఆలింగణం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో దుర్గమ్మ నిమజ్జన శోభాయాత్రలు కన్నుల పండువగా నిర్వహించారు. డీజే చప్పుళ్ల మధ్య యువకుల నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. వెళ్లి.. మళ్లీ రా.. దుర్గమ్మ తల్లి అంటూ, నీ చల్లని ఆశీస్సులతో అభివృద్ధి సాధించాలని ప్రజలు వేడుకున్నారు.