6 March, 2026 | 11:33 PM

సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం

06-03-2026 03:43 PM

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బంబార గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ స్వయంగా పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్య పనులు చేయించారు.

గ్రామం శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవ హరించాలని సర్పంచ్ బెండరే కృష్ణాజీ తెలిపారు. గ్రామా భివృద్ధికి పరిశుభ్రత ఎంతో అవసరమని,ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నా రు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, గ్రామ పంచా యతీ కార్యదర్శి ధర్మయ్య, పంచాయతీ సిబ్బంది, సాఫై కార్మికులు తదితరులు పాల్గొన్నారు.