5 May, 2026 | 1:56 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్ వర్క్ షాప్

06-03-2026 03:57 PM

కుమ్రం భీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని  శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈకో  క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పేపర్ క్రాఫ్ట్ వర్క్ షాప్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్  సాయిని రాజశేఖర్, ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్‌లో ఈకో క్లబ్ కోఆర్డినేటర్ కుమారి శాంతిషా ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, పర్యావరణ హిత పద్ధతులను ప్రోత్సహించడం, కాగిత పదార్థాలను వినియోగించి కళాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

వర్క్ షాప్ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల కాగితాలతో గ్రీటింగ్ కార్డులు, గోడకు వేలాడదీయే అలంకార వస్తువులు, పేపర్ బ్యాగులు, పూలు, వివిధ అలంకార నమూనాలు తయారు చేసే విధానాలను నేర్చుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము తయారు చేసిన పేపర్ క్రాఫ్ట్ నమూనాలను ప్రదర్శిస్తూ వాటి తయారీ విధానాన్ని ఇతరులకు వివరించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని కళాశాల నిర్వాహకులు పేర్కొన్నారు.