02-08-2025 01:42:21 AM
మహబూబ్ నగర్ ఆగస్టు 1 (విజయ క్రాంతి) : వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకొని సుభాష్ నగర్ వార్డ్ నెంబర్ 47 లో ప్రత్యేకంగా పరిశీలించారు.
డెంగ్యూ సోకిన ఇంటిని, పరిశీలించి డెంగ్యూ సోకిన బాలిక తో కలెక్టర్ మాట్లాడారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స చికిత్స తీసుకున్నట్లు,ఇప్పుడు బాగానే ఉందని బాలిక కలెక్టర్ కు తెలియ చేశారు.డెంగ్యూ వచ్చిన ఇంటి పరిసరాలు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, మున్సిపల్ శానిటేషన్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.