calender_icon.png 2 August, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేసిన కలెక్టర్

02-08-2025 01:44:28 AM

నారాయణపేట.ఆగస్టు 1.(విజయ క్రాంతి):నీతి ఆయోగ్ - ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమం కింద శుక్రవారం జిల్లా అధికారులు, నర్వ మండల అధికారులు మరియు సంపూర్ణ అభియాన్ సమ్మన్ సమరోహ్ కింద నర్వలోని ఫ్రంట్లైన్ కార్మికులకు సౌకర్యాలు కల్పించడానికి జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్ లో జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షత వహించి సంపూర్ణ అభియాన్ - ఆరోగ్యం, పో షకాహారం, వ్యవసాయం మరియు సామాజిక అభివృద్ధి రంగాల నుండి సూచికల సంతృప్తత గురించి మాట్లాడారు. నర్వ బ్లాక్లోని జిల్లా అధికారులు, మండల అధికారులు, ఫ్రంట్లైన్ కార్మికులకు అవార్డులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గం గ్వర్ మాట్లాడుతూ నిజాయితీగా పని చేయాలని మరియు కే పీ ఐ సూచికలను సంతృప్తి పరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీ ఆర్ డి ఓ/ నోడల్ అధికారి మొగులప్ప,జిల్లా పం చాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, డాక్టర్ శైలజ, నర్వ ఎంపీడీవో శ్రీనివాస్, సిడిపిఓ, మెప్మా అధికారులు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్, మండల అధికారులు, అంగన్వాడీ టీచర్లు,ఉపాధ్యాయులు, ఏ ఎన్ ఎం లు, ఏ ఈ ఓ లు,ఆశా కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.