24 July, 2026 | 2:22 PM

బీజేపీ, కాంగ్రెస్‌కు చెరిసగం!

05-06-2024 02:21 AM

గోవాలో రెండు పార్లమెంటు నియోజక వర్గాలు ఉన్నాయి. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒక్క సీటు గెలుచుకోగా, కాంగ్రెస్ మరో సీటును గెలుచుకుంది. ఇక్కడ మే ౭ వ తేదీన పోలింగ్ జరిగింది. రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ౧౧.౬౯ లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రెండు పార్టీలు కూడా తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకున్నాయి. నార్త్ గోవాలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ్రీపాద్ నాయక్ గెలుపొందారు. ఆయన ౧౯౯౯ నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్‌కు కంచుకోట  లాంటి సౌత్ గోవా నుంచి సిట్టింగ్ ఎంపీ విరియాటో ఫెర్నాండేజ్ సత్తా చాటారు.