ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ
25-05-2024 01:27 AM
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అంచనా
చండీగఢ్, మే 24: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని శుక్రవారం చండీగఢ్‌లో తెలిపారు. ‘ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని అభ్యర్థి ఎవరని పదేపదే ప్రశ్నిస్తున్నవాళ్లకు చెప్తున్నా.. 2004లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన మెజారిటీ వచ్చిన మూడు రోజుల్లోనే మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాం. ఈసారి మూడు రోజులు కూడా పట్టదు’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీ పదేపదే ఎన్నికల సభల్లో ప్రశ్నిస్తుండటంతో జైరాంరమేశ్ ఈ విధంగా స్పందించారు.






