24 June, 2026 | 1:44 AM

వర్ష ప్రభావిత ప్రాంతాల నాలాల పూడిక

24-06-2026 12:52 AM

బోధన్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుధర్శన్ రెడ్డి సూచనలు మేరకు, ఈరోజు బోధన్ పట్టణంలో వర్షాల కృస్స్తున్న సందర్భంగా ముందస్తుగా నీటిలో మునిగే, లోతట్టు ప్రాంతాలు కాలనీలు, వర్షపు నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్లకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయేలా కాలువలను శుభ్రపరచడం, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, సౌకర్యాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, వర్షాల సమయంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.